Share News

PM Modi : టెక్స్‌టైల్‌ ఎగుమతుల్ని రూ.9లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:24 AM

ఔళి ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి ముందే రూ.9 లక్షల కోట్లకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న భారత్‌ టెక్స్‌

PM Modi : టెక్స్‌టైల్‌ ఎగుమతుల్ని రూ.9లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఔళి ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి ముందే రూ.9 లక్షల కోట్లకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న భారత్‌ టెక్స్‌ కార్యక్రమానికి మోదీ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్స్‌టైల్‌ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రపంచంలో ఆరో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉన్న భారత్‌ గతేడాది 7ు వృద్ధి నమోదు చేసిందని చెప్పారు. ప్రస్తుతం రూ.3లక్షల కోట్లుగా ఉన్న వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి ముందే మూడింతలు రూ.9లక్షల కోట్లకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 05:24 AM