Pushkaraj Sabharwal: విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:14 AM
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దుర్ఘటనలో మరణించిన.....
సుప్రీంకోర్టులో పైలట్ తండ్రి పిటిషన్
న్యూఢిల్లీ, అక్టోబరు 16: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దుర్ఘటనలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి 91 ఏళ్ల పుష్కరాజ్ సభర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం కూలడంతో 260 మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్‌వెస్టిగేషన్ బోర్డు (ఏఏఐబీ) దర్యాప్తు చేసి, ఇచ్చిన ప్రాథమిక నివేదికలో లోపాలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రమాదంలో మరణించిన పైలట్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లెవ్ కుందర్‌లదే తప్పు అన్నట్టుగా నివేదిక ఉందని, అందువల్ల నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపించాలని కోరారు.