Rahul Gandhi: వ్యక్తిగత దాడులే ఆర్‌ఎస్‌ఎస్ విధానం
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:52 AM
వ్యక్తిగత దాడులే ఆర్‌ఎస్‌ఎస్ విధానమని.. జాతిపిత మహాత్మాగాంధీ పైనా వారు అదే పని చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం ఆరోపించారు..
గాంధీజీపైనా అదే పని చేశారు: రాహుల్ గాంధీ
కుట్రతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు: ప్రియాంకాగాంధీ
అరారియా, మధుబని, సుపాల్(బిహార్), ఆగస్టు 26: వ్యక్తిగత దాడులే ఆర్‌ఎ్‌సఎస్ విధానమని.. జాతిపిత మహాత్మాగాంధీ పైనా వారు అదే పని చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం ఆరోపించారు. బిహార్‌లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన మహాఘట్‌బంధన్ సభ్యులతో నిర్వహించిన చర్చలో ఈమేరకు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక దాబా వద్ద రాహుల్‌గాంధీ ఆర్జేడీకి చెందిన తేజస్వియాదవ్, సీపీఐ ఎంఎల్‌కి చెందిన దీపాంకర్ భట్టాచార్య, మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌గాంధీ, బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజే్‌షకుమార్‌లతో కలిసి టీ తాగుతూ కనిపించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. గాంధీజీపై ఆర్‌ఎ్‌సఎస్ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు చేయడం అధికారికం అయిపోయిందని తుషార్‌గాంధీ అన్నారు. తేజస్వియాదవ్ మాట్లాడుతూ.. 2014 నుంచే ఈ సంస్కృతి మొదలైందని పేర్కొన్నారు. కాగా బిహార్‌లోని సుపాల్‌లో మంగళవారం జరిగిన ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రత్యేక ఓట్ల తనిఖీ ద్వారా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌లో కుట్రపూరితంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News