Share News

Pawan Singhs Wife Jyoti Singh: రాజకీయాల్లోకి స్టార్ హీరో భార్య.. ఎన్నికల్లో పోటీ..

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:17 PM

కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది.

Pawan Singhs Wife Jyoti Singh: రాజకీయాల్లోకి స్టార్ హీరో భార్య.. ఎన్నికల్లో పోటీ..
Pawan Singhs Wife Jyoti Singh

భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్‌.. ఆయన భార్య జ్యోతీ సింగ్‌ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన భర్త స్త్రీ లోలుడంటూ జ్యోతీ సంచలన కామెంట్లు చేశారు. గృహ హింస కారణంగా నరకం చూస్తున్నానంటూ బాంబ్ పేల్చింది. పవన్ సింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిహార్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇలాంటి సమయంలో జ్యోతీ సింగ్ రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం చేసుకుంది.


వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరకట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది. జ్యోతీ సింగ్ తండ్రి రాంబాబు సింగ్ కూతురి రాజకీయ ప్రవేశం ఖాయమైందని నిన్ననే స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘జ్యోతీ సింగ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది.


ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుంది?.. ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తుంది? లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుందా?.. అన్నది త్వరలో డిసైడ్ అవుతుంది. ప్రజలు జ్యోతిని కరకట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. ఆ ప్రాంత ప్రజలతో జ్యోతీకి మంచి బంధం ఉంది’ అని అన్నారు. పవన్, జ్యోతీల గొడవ గురించీ ఆయన మాట్లాడారు. ‘నా కూతురితో కలిసి ఉండమని పవన్‌ను చాలా బతిమాలాను. కానీ, అతడు మాత్రం విడాకులు కావాలంటున్నాడు. అధికారికంగా విడాకులు వచ్చే వరకు తన భర్తతో ఉండే హక్కు నా కూతురికి ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

అల్లూరి జిల్లాలో విషాదం.. కందిరీగల దాడిలో యువతి బలి..

తాజ్ మహల్ కాంప్లెక్స్ వద్ద అగ్నిప్రమాదం

Updated Date - Oct 13 , 2025 | 06:46 PM