Wasp Attack In Araku: అల్లూరి జిల్లాలో విషాదం.. కందిరీగల దాడిలో యువతి బలి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:29 PM
శాంతి పశువులను కాసేందుకు వెళ్లింది. పశువులను కాస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కందిరీగలు ఆమెపై విరుచుకుపడ్డాయి. విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో శాంతి తీవ్రంగా గాయపడింది.
అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనంతగిరి మండలం కరాయిగూడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల కే శాంతి పశువులను కాసేందుకు వెళ్లింది. పశువులను కాస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కందిరీగలు ఆమెపై విరుచుకుపడ్డాయి. విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో శాంతి తీవ్రంగా గాయపడింది.
ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన గ్రామస్తులు ఆమెను వెంటనే అరకులోయ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు శాంతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆమెను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శాంతి తుది శ్వాస విడిచింది. శాంతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వీధి రౌడీలా మారిన కోతి.. బైకర్‌పై దాడి..
రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు