Share News

Passport Application: పాస్‌పోర్టు నిబంధన సరళతరం

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:37 AM

పాస్‌పోర్టు దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Passport Application: పాస్‌పోర్టు నిబంధన సరళతరం

  • పెళ్లి సర్టిఫికెట్‌ లేకుంటే ‘అనుబంధం జే’ పూర్తి చేస్తే సరి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: పాస్‌పోర్టు దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను సరళీకృతం చేస్తూ భారత విదేశీ మంత్రిత్వ శాఖ విధానపర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పాస్‌పోర్టు సేవ వెబ్‌ సైట్‌లో కూడా మార్పులను జోడించారు. దీని ప్రకారం ‘అనుబంధం జే’ను పాస్‌పోర్టు దరఖాస్తుదారు పూరించాల్సి ఉంటుంది.


దానిపై దంపతులు ఇద్దరూ తేదీ, స్థలం పేర్కొంటూ సంతకం చేయాలి. వివాహం అయిందని, కలిసి ఉంటున్నామని నిర్ధారించాలి. తాము నివసిస్తున్న చిరునామాను పేర్కొనాలి. కలిసి దిగిన ఫొటోను ‘స్వీయ నిర్ధారణ’ చేసి జత చేయాలి. ఇరువురి ఆధార్‌ లేదా ఓటర్‌ ఐడీ లేదా పాస్‌పోర్టు నంబరును పేర్కొనాలి. దీనివలన పెళ్లి సర్టిఫికెట్‌ లేకపోయినా జీవిత భాగస్వామి పేరును జత చేసుకొని సులభంగా పాస్‌పోర్టు పొందవచ్చు

Updated Date - Apr 12 , 2025 | 05:37 AM