Para Athlete Jogendra Chhatria: తీవ్ర విషాదం.. పారా అథ్లెట్ ప్రాణం తీసిన వీధికుక్క
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:55 PM
Para Athlete Jogendra Chhatria: జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది.
దేశంలో కుక్క కాటు కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. వీధి కుక్కలు చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వాళ్ల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. వీధికుక్కల కాట్ల కారణంగా రేబీస్ వ్యాధి సోకి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా, ఒడిశాలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వీధికుక్క ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. వారిలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన పారా అథ్లెట్ కూడా ఉండటం గమనార్హం. ఇక, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జులై 23వ తేదీన బొలన్‌గిర్‌కు చెందిన నేషనల్ లెవెల్ పారా అథ్లెట్ జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది. దాదాపు 6 మందిని విచక్షణా రహితంగా కరిచేసింది. కుక్క దాడిలో గాయపడ్డ వారిని స్థానికులు బోలన్‌గిర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బుర్లాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆరు మందిలో నలుగురు కోలుకున్నారు. జోగేంద్ర ఛత్రియాతో పాటు 48 ఏళ్ల హృషికేష్ రానా శనివారం చనిపోయాడు. కుక్కకాటు కారణంగా ఇద్దరు మరణించటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కేంద్రం లెక్కల ప్రకారం... గత సంవత్సరం దేశ వ్యాప్తంగా 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదు అయ్యాయి. 54 మంది రేబీస్ వ్యాధి కారణంగా మరణించారు. ఈ సంవత్సరం బీహార్‌కు చెందిన జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌కు చిన్న కుక్క పిల్ల కరిచి రేబీస్ వ్యాధి సోకింది. ఆ వ్యాధి కారణంగా అతడు చనిపోయాడు.
ఇవి కూడా చదవండి
డిప్యూటీ సీఎం 2 ఓటరు ఐడీలు కలిగి ఉన్నారన్న తేజస్వి యాదవ్.. క్లారిటీ
గ్లూ అడిక్షన్.. బామ్మను చంపేసిన యువకుడు