Share News

Pakistan F 16 Shot Down: పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత సైనిక దళాలు

ABN , Publish Date - May 08 , 2025 | 10:05 PM

పాక్‌కు చెందిన సర్గోధా వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసినట్టు తెలుస్తోంది.

Pakistan F 16 Shot Down: పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత సైనిక దళాలు
India Pakistan military conflict

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసినట్టు తెలుస్తోంది. పాక్‌లోని సర్గోధా వైమానిక స్థావరం నుంచి ఈ ఎఫ్-16 బయలుదేరింది. అయితే, ఈ ఎయిర్‌బేస్ స్థావరానికి సమీపంలోనే భారత్ ఎఫ్-16ను కూల్చేసినట్టు తెలుస్తోంది. భూతలం నుంచి ప్రయోగించిన క్షిపణి ఆ విమానాన్ని కూల్చేసినట్టు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.


యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్న పాకిస్థాన్ ఒక్కసారిగా జమ్మూ, పంజాబ్‌పై మిసైల్, డ్రోన్ దాడులకు దిగింది. సరిహద్దు ప్రాంతాలపై ఆర్టీలరీ గుళ్ల వర్షం కూడా కురిస్తోంది. అయితే, భారత్ ఈ దాడులకు దీటుగా తిప్పికొడుతోంది. ఎస్-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లు, మిసైళ్లను కూల్చేసింది. వీటితో పాటు పాక్‌కు చెందిర రెండు జేఎఫ్ -17 యుద్ధ విమానాలను కూడా పాక్ కూల్చేసినట్టు సమాచారం.

Updated Date - May 08 , 2025 | 11:37 PM