Pakistan Drones on Jaisalmer: జైసల్మేర్ పైకి పాకిస్తాన్ డ్రోన్లు.. ఆకాశంలో ఏం జరిగిందో చూడండి
ABN , Publish Date - May 08 , 2025 | 11:31 PM
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల పైనే దాడులకు పాల్పడితే.. పాకిస్తాన్ మాత్రం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది.
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల పైనే దాడులకు పాల్పడితే.. పాకిస్తాన్ మాత్రం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది. రాజస్తాన్‌లోని జైసల్మేర్ నగరం పై పాక్ డ్రోన్లు, మిసైల్స్ దాడికి తెగబడ్డాయి. అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది.
జైసల్మేర్ గగనతలంలోకి వస్తున్న పాకిస్తానీ డ్రోన్లను భారత సైన్యం నిర్వీర్యం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఆకాశంలో పేలుళ్లు సంభవించాయి. సైరెన్లు మోగడం వినిపిస్తోంది. నగరం అంతా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.