Pakistan Denies Striking Indian Cities: భారతీయ నగరాలపై తాము దాడులు చేయలేదన్న పాక్
ABN , Publish Date - May 08 , 2025 | 11:49 PM
భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న పాకిస్థాన్ తాజాగా మాటమార్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న పాకిస్థాన్ తాజాగా మాటమార్చింది. తాము భారత్‌లోని పౌర ప్రాంతాలను టార్గెట్ చేయలేదని చెప్పినట్టు రాయిటర్స్ సంస్థ పేర్కొంది.
నేటి సాయంత్రం పాక్ మిసైల్స్, డ్రోన్ దాడులతో జమ్మూ, పంజాబ్ రాష్ట్రాలపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే కూల్చివేశాయి. సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో బ్లాక్ ఔట్ కూడా కొనసాగుతోంది. మరోవైపు, భారత్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. తాజా పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివిధ దేశాల నేతలకు అప్‌డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము పౌరప్రాంతాలపై దాడులు చేయలేదని పాక్ తాజాగా చెప్పుకుంది.