Share News

Pakistan: పాక్‌ రక్షకుడిగా దేవుడు నన్ను సృష్టించాడు: మునీర్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:40 AM

పాకిస్థాన్‌కు రక్షకుడిగా దేవుడు తనను సృష్టించాడని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిగా, లేదా రాజకీయ నేతగా మారాలనే ఆలోచనలేమీ తనకు లేవన్నారు.

Pakistan: పాక్‌ రక్షకుడిగా దేవుడు నన్ను సృష్టించాడు: మునీర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 17: పాకిస్థాన్‌కు రక్షకుడిగా దేవుడు తనను సృష్టించాడని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిగా, లేదా రాజకీయ నేతగా మారాలనే ఆలోచనలేమీ తనకు లేవన్నారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తూ బెల్జియంలో దిగిన మునీర్‌ పాక్‌ జర్నలిస్టు సుహైల్‌ వార్రాయిచ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయ మార్పులకు సమయం ఆసన్నమైందన్న వార్తలను ఊహాగానాలుగా ఆయన తోసిపుచ్చారు. ‘దేశ రక్షకుడిగా నన్ను దేవుడు సృష్టించాడు.


అంతకుమించి మరే హోదా నాకు అవసరం లేదు. నేనొక సైనికుడిని. దేశం కోసం ప్రాణాలర్పించడమే నా అతిపెద్ద ఆకాంక్ష’ అన్నారు. తమ దేశాన్ని అస్థిపరిచేందుకు అఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ చేతులు కలిపితేగనుక భారత్‌పై తాము దాడి చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Aug 18 , 2025 | 05:41 AM