Operation Sindoor: ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన పహల్గాం బాధితురాలు
ABN , Publish Date - May 07 , 2025 | 08:35 AM
పాక్‌పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమకు కొంత వరకూ సాంత్వన దక్కిందని పహల్గాం మృతుడు ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆర్తీ మీనన్ మీడియాకు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కొంతైనా న్యాయం దక్కిందని పలువురు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆర్తీ మీనన్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. ఈ దుఃఖ భరిత సమయంలో తమకు ఈ దాడులు కొంత స్వామత కలిగించాయని అన్నారు. ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. ‘‘మాకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడదు. కానీ పాక్‌పై భారత్ తీసుకుంటున్న చర్యలు గర్వకారణం. ఈ చర్యలతో దేశం మరింత బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా’’ అరి ఆర్తీ అన్నారు.
బుధవారం అర్ధరాత్రి 1.44 సమయంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పీఓకేతో పాటు పాక్‌లోని ఉగ్రస్థావరాలై దాడులకు దిగింది. మొత్తం 9 ప్రాంతాలపై బాంబులతో దాడుల చేసింది. ఈ ఆపరేషన్‌లో సైనిక వైమానిక, నావికా దళాలు పాల్గొన్నాయి. దాడుల్లో సుమారు 90 మంది మరణించినట్టు తెలుస్తోంది. జైష్ ఏ మహ్మద్, లష్కరే తయ్యబా ఉగ్రసంస్థలను టార్గెట్ చేసుకునేందుకు భారత్ ఈ స్థావరాలను ఎంచుకుంది. భారత చర్యలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇజ్రాయెల్, రష్యా సహా అనేక దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ భారత్‌కు మద్దతు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం