Political Rival: బీజేపీ బలమైన రాజకీయ ప్రత్యర్థి ఒవైసీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:01 AM
బీజేపీని ’బలమైన రాజకీయ ప్రత్యర్థి’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో.....
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: బీజేపీని ’బలమైన రాజకీయ ప్రత్యర్థి’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ, నేతలు కార్యకర్తలు రాత్రింబవళ్లు పని చేస్తారని ప్రశంసించారు. ’’బీజేపీని ఓడించడం అంత సులువు కాదు. తాను అనుకున్న పనిని రెప్పపాటు కాలంలో చేయగలదు. ప్రతిపక్షాలు బీజేపీని ఎదుర్కొవాలంటే దాని ప్రతి కదలికపై అప్రమత్తంగా ఉండాలి’’ అని ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే, బిహార్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తమ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ’ఓట్ చోరి’ ఆరోపణలపై.. ఆయన తరపున మాట్లాడలేనని, కానీ బీజేపీలా పోరాట పటిమను చూపకపోతే ఆ పార్టీని ఓడించలేమని ఓవైసీ అన్నారు.