OPS: కొత్త పార్టీ దిశగా ఓపీఎస్ అడుగులు.. అదేగాని జరిగితే..
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:11 AM
రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించిన ప్రధాని మోదీ.. తనకు కనీసం నిమిషమైనా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం పట్ల అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంతో వున్నారు.
- మోదీ అపాయింట్‌మెంట్ లభించక మనస్తాపం
చెన్నై: రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించిన ప్రధాని మోదీ.. తనకు కనీసం నిమిషమైనా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం పట్ల అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) తీవ్ర మనస్తాపంతో వున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎ్‌స)కు మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోదీ.. తనను మాత్రం దూరంగా పెట్టడం పట్ల ఆయన కినుక వహించినట్లు సమాచారం.

దీంతో బీజేపీని నమ్ముకుంటే తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్న ఓపీఎస్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో చేతులు కలపడంపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన మద్దతుదారులతో ఏర్పాటైన హక్కుల పరిరక్షణ కమిటీ అనే విభాగాన్ని రాజకీయ పార్టీగా మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త పార్టీకి ఎంజీఆర్-అమ్మ అన్నాడీఎంకే అనే పేరు ఎంపిక చేశారని, కొత్త పార్టీ నిర్ణయాన్ని సెప్టెంబర్ 4న మదురైలో నిర్వహించనున్న మహానాడులో ఓపీఎస్ ప్రకటిస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News