Waqf Bill: నేడు లోక్‌సభకు ‘వక్ఫ్’పై జేపీసీ నివేదిక
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:15 AM
జనవరి 30వ తేదీనే జేపీసీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. దీనిపై ప్రతిపక్ష నేతలు తమ అసమ్మతిని తెలియజేశారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30వ తేదీనే జేపీసీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. దీనిపై ప్రతిపక్ష నేతలు తమ అసమ్మతిని తెలియజేశారు. అయితే, తనకు సమాచారం ఇవ్వకుండా నివేదికపై తాను వ్యక్తం చేసిన అసమ్మతిని తొలగించారని జేపీసీలో సభ్యుడైన కాగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఆరోపించారు. జేపీసీ సభ్యుడిగా తన వ్యతిరేకతను సవివరంగా ప్రకటించానని అయితే, ఆ వివరాలేవీ నివేదికలో లేకపోవడం విస్మయానికి గురి చేస్తోందని హుస్సేన్ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.