Kushinagar Medical College: 17 మంది పాపలకు సిందూర్ పేరు
ABN , Publish Date - May 13 , 2025 | 05:15 AM
ఉత్తరప్రదేశ్ కుషినగర్ మెడికల్ కాలేజీలో జన్మించిన 17 ఆడపిల్లలకు ’ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో తల్లిదండ్రులు ’సిందూర్’ అనే పేరు పెట్టారు. పాకిస్థాన్‌పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ స్మరించేందుకు ఈ పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
కుషినగర్ (యూపీ), మే 12: ’ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్‌లోని నవజాత శిశువులకు ’సిందూర్’గా వారి తల్లిదండ్రులు నామకరణం చేశారు. కుషినగర్ మెడికల్ కాలేజీలో మే 10, 11 తేదీల్లో జన్మించిన 17 మంది ఆడపిల్లలకు సిందూర్ అని పేరు పెట్టారని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే షాహీ తెలిపారు. పాకిస్థాన్ పై భారతసైన్యం చేసిన ఈ ఆపరేషన్‌కు గుర్తుగా.. పుట్టిన పిల్లలకు ఈ పేరు పెట్టడాన్ని తల్లిదండ్రులు గౌరవసూచకంగా భావిస్తున్నారని ఆయన చెప్పారు. ’’పహల్గాం దాడిలో ఎంతో మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోయారు. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో దీటుగా స్పందించింది. సైనికుల త్యాగాలను గౌరవిస్తూ మా కుమార్తెలకు సిందూర్ అని పేరు పెట్టాం’’ అని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు.