Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడి స్పందన ఇదే
ABN , Publish Date - May 07 , 2025 | 08:00 AM
ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పందించారు. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పందించారు. ‘‘మాకు ఈ విషయం ఇందాకే తెలిసింది. అక్కడ చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నా’’ అని ఆయన అన్నారు. భారత్, పాక్ ఉద్రికత్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ఈ మేరకు సమాధానమిచ్చారు.
బుధవారం అర్ధరాత్రి సుమారు 1.44 గంటలకు భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పీఓకేలోనే కాకుండా పాక్ భూభాగంలో 560 కిలోమీటర్ల లోపలున్న ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఈ దాడుల్లో మిగ్ 29కే, రఫేల్ యుద్ధ విమానాలు మిసైళ్ల దాడులు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడుల తరువాత భారత్, పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. పరిస్థితిని మరింత దిగజార్చేలా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం