Share News

Operation Sindoor: జైసల్మేర్‌లోనూ డ్రోన్ దాడులు.. పాక్ డ్రోన్లను కూల్చిన సైన్యం

ABN , Publish Date - May 08 , 2025 | 10:03 PM

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ అందుకు ప్రతిగా దాడులకు దిగింది. ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది. జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ అటాక్‌‌కు పాల్పడింది

Operation Sindoor: జైసల్మేర్‌లోనూ డ్రోన్ దాడులు.. పాక్ డ్రోన్లను కూల్చిన సైన్యం
Drone Attack

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ అందుకు ప్రతిగా దాడులకు దిగింది. ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది. జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ అటాక్‌‌కు పాల్పడింది. 8 పాక్‌ మిస్సైల్స్‌ను భారత్ చాకచక్యంగా కూల్చేసింది.


అలాగే రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. భారత్ సైన్యం పాక్ డ్రోన్లను కూల్చివేసింది. పలు సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. అలాగే అమృత్‌సర్‌లోని విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సరిహిద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో లైట్లు ఆర్పేయాలని ప్రభుత్వం సూచించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రలు ప్రాంతాలను బ్లాకవుట్ చేశారు.

Updated Date - May 08 , 2025 | 10:03 PM