Share News

Tigers: ఆ అడవుల్లో.. పులుల పట్టివేతకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:24 PM

రాష్ట్రంలో ఇటీవల పులుల దాడులు పెరిగిన నేపథ్యంలతో.. వాటిని పట్టుకునేందుకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’ పేరుతో ఓ కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి.., అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయన్న వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Tigers: ఆ అడవుల్లో.. పులుల పట్టివేతకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’

- డ్రోన్‌ సర్వేతో గుర్తింపు

- రంగంలోకి కుంకీ ఏనుగులు

బెంగళూరు: చామరాజనగర జిల్లాలో ఇటీవల పులుల దాడులు పెరిగిన నేపథ్యంలో పులుల పట్టివేతకు అటవీశాఖ ‘ఆపరేషన్‌ బీస్ట్‌’ పేరిట ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. భీమనబీడు(Bheemanabedu) చుట్టుపక్కల గ్రామాల ప్రదేశాలలో అటవీఅధికారులు మకాం వేశారు. బండీపుర పులుల అభయారణ్య సిబ్బంది పులులకోసం కూంబింగ్‌ ప్రారంభించారు. ఇందులో డ్రోన్‌ కెమెరాలు కీలకపాత్ర వహించనున్నాయి. సీఎ్‌ఫఓ ప్రభాకరన్‌ సూచనతో కూంబింగ్‌ చేపట్టారు.


డ్రోన్‌ కెమెరాల ద్వారా పులుల సంచారాన్ని గుర్తించనున్నారు. నంజేదేవర గ్రామంలోని ఓ క్వారీలో ఐదు పులులు సంచరిస్తున్నట్టు డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించారు. పులుల జాడ తెలియడంతో నంజేదేవనపుర, ఉడిగాల, వీరనపుర మూడు గ్రామాలలో సోమ, మంగళవారాలలలో రెండు రోజులపాటు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చామరాజనగర తహసీల్దార్‌ గిరిజా ఆదేశించారు.


pandu5.jpg

గ్రామాలలో పులుల సంచారానికి సంబంధించి గ్రామస్తులనుంచి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే పుట్టరంగశెట్టి స్పందించారు. నంజేదేవనపుర గ్రామానికి వచ్చారు. పులులను గ్రామాలనుంచి దట్టమైన అడవులలోకి పంపడం కాదని వాటిని బంధించాలని రైతులు డిమాండ్‌ చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే వెంటనే సీఎం సిద్దరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రెలకు ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. దీంతో కుంకీ ఏనుగులను రంగంలోకి దించేలా మంత్రి ఆదేశించారు. కార్యాచరణలోకి ఈశ్వర, లక్ష్మణ అనే ఏనుగులను సోమవారం రంగంలోకి దించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 01:24 PM