Share News

Bengaluru: ఆ పాఠశాలలో.. ఒకేఒక్క విద్యార్థిని

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:21 PM

సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు పెరిగిపోవడంపై విద్యాశాఖ గగ్గోలు పెడుతోంది. సమీపంలోని పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు స్థానికులు, ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలుచోట్ల వింత పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.

Bengaluru: ఆ పాఠశాలలో.. ఒకేఒక్క విద్యార్థిని

- సకల సౌకర్యాలున్నా విద్యార్థులు లేని దుస్థితి

బెంగళూరు: సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు పెరిగిపోవడంపై విద్యాశాఖ గగ్గోలు పెడుతోంది. సమీపంలోని పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు స్థానికులు, ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలుచోట్ల వింత పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా మిట్టహళ్ళిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక విద్యార్థిని మాత్రమే ఉంది. ఈ విద్యార్థి కోసం ఓ ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో 72 ఇళ్లు ఉండగా.. 436 మంది జనాభా ఉన్నారు.


పదిమంది విద్యార్థులు ప్రాథమిక విద్యకోసం ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు లేకుండా పోయారు. ఒక విద్యార్థి కోసమే మధ్యాహ్న భోజనం కూడా తయారు చేస్తున్నారు. పాఠశాలలో ఓ తరగతి గది, వంటగది, శౌచాలయం, తాగునీటి వ్యవస్థ, ఫర్నీచర్‌ అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలని తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేట్‌ పాఠశాలకు పంపుతున్నారు.


pandu2.2.jpg

43ఏళ్లక్రితం ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. ఇటీవల వరుసగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఒకే విద్యార్థిని ఉన్నట్లు ఉపాధ్యాయుడు గంగాధర్‌ తెలిపారు. బీఈఓ రామచంద్ర అభిప్రాయం మేరకు ఇక్కడ పాఠశాలను మూసివేయాలనే ఆలోచన లేదని, వచ్చే ఏడాది అయినా పిల్లలు వస్తారని భావిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు పాఠశాలను కాపాడుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన

Read Latest Telangana News and National News

Updated Date - Jun 07 , 2025 | 01:21 PM