Share News

Advance Tipping: క్యాబ్ బుకింగ్ యాప్స్‌లో అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్‌‌పై కేంద్రం నజర్

ABN , Publish Date - May 30 , 2025 | 11:21 AM

రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో ఇటీవల కనిపిస్తున్న అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్‌పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దృష్టి సారించింది. ఇది అనైతిక విధానమని ఇప్పటికే సీసీపీఏ పేర్కొంది.

Advance Tipping: క్యాబ్ బుకింగ్ యాప్స్‌లో అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్‌‌పై కేంద్రం నజర్
Advance Tipping Feature Controversy

ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ బుక్ చేసే క్రమంలో డ్రైవర్‌‌లకు ముందస్తు టిప్ చెల్లించేందుకు ఉద్దేశించిన అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్‌పై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) దృష్టి సారించింది. పలు రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ అనైతికమని, క్యాబ్ కోసం వేలాన్ని ప్రోత్సహించేలా ఉందని అభిప్రాయపడింది.

ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల స్పందించారు. సీసీపీఏ ఈ విషయంపై విచారణ చేపట్టిందని అన్నారు. ‘‘త్వరగా క్యాబ్ బుక్ చేసుకునేందుకు ముందస్తు టిప్ చెల్లించాలని వినియోగదారులను బలవంతం చేయడం అనైతికం. ఈ చర్యలు అనైతిక వ్యాపార విధానాల కిందకు వస్తాయి. టిప్ అంటే వినియోగదారులు తమకు అందిన సర్వీసుపై సంతృప్తితో చేసే ప్రశంసాపూర్వక చర్య. సర్వీసు పొందేందుకు నిబంధన కాదు’’ అని జోషి అన్నారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, పలు రైడ్ హెయిలింగ్ యాప్స్‌ అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. దీనిపై ఇప్పటికే నెట్టింట వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఈ విషయంపై దృష్టి సారించింది.


ఇవీ చదవండి:

అమెరికా ఇప్పటివరకూ 1080 మంది భారతీయుల్ని డిపోర్టు చేసింది: విదేశాంగ శాఖ

ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 01:59 PM