Share News

Minister: తేల్చేశారు... గృహ విద్యుత్‌ ఛార్జీలు పెరగవు..

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:15 PM

గృహ విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రి పి.శివశంకర్‌(Minister P. Shivshankar) స్పష్టం చేశారు.

Minister: తేల్చేశారు... గృహ విద్యుత్‌ ఛార్జీలు పెరగవు..

- మంత్రి శివశంకర్‌

చెన్నై: గృహ విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రి పి.శివశంకర్‌(Minister P. Shivshankar) స్పష్టం చేశారు. జూలై 1 నుంచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మంత్రి పి.శివశంకర్‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో... గృహ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి ఛార్జీల పెంపు ఉండదని గత మే 20వ తేది స్పష్టంగా ప్రకటించామన్నారు.


zzzzzzzzzzzzzzzzzzzzz.jpg

ఒకవేళ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసులతో ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని, ఆ సమయంలో కూడా గృహ విద్యుత్‌ ఛార్జీలు పెరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం అందిస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సహా అన్ని రాయితీలు కొనసాగుతాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 30 , 2025 | 02:15 PM