Share News

US Dadagiri Remark: భారత్ ఇలాంటి దాదాగిరి ఎన్నటికీ చేయదు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:16 PM

ఆర్థిక, సాంకేతిక సంపత్తి కారణంగా కొన్ని దేశాలు దాదాగిరికి దిగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ మాత్రం ఇలా ఎన్నడూ చేయదని అన్నారు. సాంకేతికత ఆధారంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.

US Dadagiri Remark: భారత్ ఇలాంటి దాదాగిరి ఎన్నటికీ చేయదు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari Dadagiri Remark

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవేదికలపై కొన్ని దేశాలు దాదాగిరి చేయడానికి కారణంగా వాటి ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ ప్రసంగించారు. ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని భారతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించుకుని స్వావలంబన సాధించాలని అన్నారు. ‘ఆర్థికంగా బలంగా ఉన్నందుకే వారు దాదాగిరి చేస్తున్నారు. వారి వద్ద సాంకేతికత కూడా ఉంది. కానీ మనకు ఇలా ఆధునిక సాంకేతికత వనరులు దక్కినా ఎవరినీ బెదిరించము. మన సంస్కృతే ఇందుకు కారణం. సమాజ సంక్షేమమే ముఖ్యమని భారతీయ సంస్కృతి బోధిస్తోంది’ అని మంత్రి అన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రైతులు, మత్స్యకారులు, డెయిరీ వర్కర్ల సంక్షేమం విషయంలో భారత్ ఎన్నటికీ రాజీపడదని అన్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగా తాను ఎంత మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని అన్నారు. రైతుల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


ఇక అమెరికా చర్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తీవ్రంగా విమర్శించారు. అందరి బాస్ అంటూ అమెరికా ప్రస్తావన తెచ్చిన మంత్రి.. భారత ఉత్పత్తుల ధరలు మరింత పెరిగేలా కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనాలు భారతీయ వస్తువుల కొనకుండా ఉండాలనేదే వారి ఉద్దేశమని చెప్పారు. భారత్ ప్రపంచస్థాయి శక్తిగా మారకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించిన ట్రంప్ ఆ తరువాత 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లు ఆపట్లేదంటూ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారు.


ఇవి కూడా చదవండి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

ఈ-ఆధార్ యాప్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

For More National News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 09:24 PM