Share News

NISAR Satellite: 90 రోజుల నిర్వహణ దశలోకి నిసార్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:05 AM

ఇస్రో నాసా జంటగా ప్రయోగించిన నిసార్‌ ఉపగ్రహం కీలకమైన 90 రోజుల నిర్వహణ దశలోకి ప్రవేశించింది.

NISAR Satellite: 90 రోజుల నిర్వహణ దశలోకి నిసార్‌

న్యూఢిల్లీ, తిరువనంతపురం, ఆగస్టు 1: ఇస్రో-నాసా జంటగా ప్రయోగించిన నిసార్‌ ఉపగ్రహం కీలకమైన 90 రోజుల నిర్వహణ దశలోకి ప్రవేశించింది. ఈ దశలో శాస్త్రవేత్తలు భూపరిశీలన కోసం పూర్తిస్థాయిలో ఉపగ్రహాన్ని సిద్ధం చేయడానికి కొన్ని తనిఖీలు, కక్ష్య సర్దుబాట్లు చేపడతారు. ‘నిసార్‌ ఉపగ్రహాన్ని 737 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాం. వాస్తవానికి దాన్ని 747 కిలోమీర్లకు చేర్చాలి. ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి దాదాపు 40-50 రోజులు పడుతుంది’ అని నాసా ఎర్త్‌ సైన్సెస్‌ డివిజన్‌లో నేచురల్‌ హజార్డ్స్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ జెరాల్డ్‌ డబ్ల్యూ బావ్డెన్‌ తెలిపారు.

Updated Date - Aug 02 , 2025 | 06:05 AM