Nirmala Sitharaman: నేడే కేంద్ర బడ్జెట్
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:09 AM
బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆమెకు వరుసగా ఇది 8వసారి. ధరల చురకలు, అత్తెసరు వేతనాలతో సతమతమవుతున్న మధ్య తరగతి జనం.. ఈసారైనా నిర్మలమ్మ పన్ను భారాన్ని తగ్గించకపోదా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆమెకు వరుసగా ఇది 8వసారి. ధరల చురకలు, అత్తెసరు వేతనాలతో సతమతమవుతున్న మధ్య తరగతి జనం.. ఈసారైనా నిర్మలమ్మ పన్ను భారాన్ని తగ్గించకపోదా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు పన్ను రేట్లను తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. కాగా, ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలకు కట్టుబడి ఉంటూనే మందగించిన వృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించేందుకు బడ్జెట్‌లో చర్యలు చేపట్టవచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్లో వస్తు, సేవల వినియోగాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది.