Share News

Plant Evolution: ఆలూ తల్లి టమాట!

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:57 AM

టమాట నుంచి ఆలుగడ్డ పుట్టిందా? ఆ రెండింటికీ మధ్య కొన్ని లక్షల ఏళ్ల అనుబంధం ఉందా?.. చైనా శాస్త్రవేత్తల పరిశోధన ఈ అంశంపై కొత్త కోణాలను వెల్లడించింది.

Plant Evolution: ఆలూ తల్లి టమాట!

  • శీతల వాతావరణాన్ని తట్టుకునే క్రమంలో దుంపలా ఆవిర్భావం

బీజింగ్‌, ఆగస్టు 2: టమాట నుంచి ఆలుగడ్డ పుట్టిందా? ఆ రెండింటికీ మధ్య కొన్ని లక్షల ఏళ్ల అనుబంధం ఉందా?.. చైనా శాస్త్రవేత్తల పరిశోధన ఈ అంశంపై కొత్త కోణాలను వెల్లడించింది. ప్రస్తుత దక్షిణ అమెరికా ఖండంలోని అండీస్‌ పర్వతప్రాంతంలో అడవి టమాట మొక్కకు, ఆలుగడ్డ వంటి ఎటుబిరోసమ్‌ అనే మొక్కతో 90 లక్షల ఏళ్ల క్రితం సంపర్కం జరిగి ఆలుగడ్డ అనే కొత్త మొక్క పుట్టిందని వీరు గుర్తించారు. టమాట, ఎటుబిరోసమ్‌ రెండూ కూడా 1.4 కోట్ల ఏళ్ల క్రితం ఒకే వృక్షజాతికి చెందినవని, తర్వాత కాలంలో అవి రెండూ విడివడిగా అభివృద్ధి చెందాయని తెలుసుకున్నారు. చైనా అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లోభాగంగా.. రైతులు పండించే ఆలుగడ్డ రకాలు, అడవిలో పెరిగిన ఆలుగడ్డ రకాలకు చెందిన 450 జన్యుక్రమాలను విశ్లేషించారు.


ఫలితాలపై ముఖ్య శాస్త్రవేత్త ఝియాంగ్‌ ఝాంగ్‌ మాట్లాడుతూ, ఆలుగడ్డ పుట్టుకకు కారణమైన టమాట, ఎటుబిరోసమ్‌.. రెండింటిలోనూ దుంపలకు ఉండేటువంటి వేళ్లు, కాండం వంటివి లేవని.. ఆ లక్షణం ఆలూలోనే ఆవిర్భవించిందని తెలిపారు. అండీస్‌ ప్రాంతంలో వాతావరణం అత్యంత శీతలంగా మారిపోతున్నందున దానిని తట్టుకొనేందుకే.. ఈ కొత్త లక్షణం అంకురించిందన్నారు. దీనివల్ల మొక్కకు అవసరమైన పోషకాలను నేల లోపల దుంప రూపంలో భద్రపర్చుకునే వీలు కలిగిందని ఝియాంగ్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్‌ జియాన్‌క్వన్‌ లీ మాట్లాడుతూ, మనుషుల్లో వంశక్రమాలను తెలుసుకోవటానికి ఉపయోగించే ‘ఫైలోజెనెటిక్‌ ఎనాలిసిస్‌’ పద్ధతినే ఇక్కడ కూడా తాము వాడామని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు సెల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 07:01 AM