Indian Students : ఆ 20 వేల మంది ఎక్కడ?!
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:45 AM
ఉన్నత విద్య కోసమని కెనడా వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ కళాశాలల్లో చేరలేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. వారంతా ఎక్కడున్నారనే దానిపై ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ విద్యార్థుల్లో చాలా మంది వరకు కెనడా
కెనడా వెళ్లి.. అక్కడ కాలేజీల్లో చేరని
వేలాది మంది భారతీయ విద్యార్థులు
జాబితాలో ఏపీ, తెలంగాణ విద్యార్థులూ..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఉన్నత విద్య కోసమని కెనడా వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ కళాశాలల్లో చేరలేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. వారంతా ఎక్కడున్నారనే దానిపై ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ విద్యార్థుల్లో చాలా మంది వరకు కెనడా నివాసంలో ఉండేందుకు, డబ్బు సంపాదించుకునేందుకు పలు రకాల పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. కొంత మంది విద్యార్థులు నకిలీ కళాశాలల చేతుల్లో మోసపోగా.. మరికొంత మంది ఉద్దేశపూర్వకంగానే కెనడాలో ఉ ద్యోగాలు చేసుకొనేందుకు స్టూడెంట్ వీసాను దుర్వినియో గం చేసినట్లు తెలిసింది. అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా కెనడా విధానంలో అంతర్జాతీయ విద్యార్థులు ముందుగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా మంది విద్యార్థులు ఆసరాగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, హరియా ణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు ఈ విఽధంగానే కెనడా వెళ్లారు. కాలేజీల్లో అడ్మిషన్లు పొం దిన విద్యార్థులు తరగతులకు మాత్రం హాజరు కా వడం లేదు. దీనికి బదులుగా డబ్బులు సంపాదించుకొనేందుకు మొబైల్ షాపుల్లో, గ్యాస్ స్టేషన్లలో, డెలివరీ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు వాస్తవంగా చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, మంచి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరకక.. చిన్న కాలేజీల అఫర్లను అంగీకరిస్తున్నారు. చివరకు అక్కడకు చేరుకున్న తర్వాత ఆ కాలేజీలు నకిలీవని తేలడమో లేదా తగిన సదుపాయాలు లేకపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఓ 26 ఏళ్ల విద్యార్థి సర్రేలోని ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. అయితే అతను తరగతులకు హాజరు కాకుండా ఒక మొబైల్ షాపులో ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతనికి ఒక గంటకు ఏడు డాలర్ల వరకు ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల మరో విద్యార్థి టోరంటోలో డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్నారు. కెనడాలో కనిపించకుండా పోయారన్న చాలా మంది విద్యార్థులు సరిహద్దు దాటలేదని, కెనడాలోనే పనిచేసుకుంటూ.. శాశ్వత నివాసం కోరుతున్నారని వలస నిపుణులు హెన్రీ లోటిన్ పేర్కొన్నారు.