Share News

PM Modi: సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:10 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు.

PM Modi: సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ కార్యదర్శి జనరల్‌ పీసీ మోడీకి రాధాకృష్ణన్‌ తరఫున ప్రధాని మోదీ నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు.


రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, జేడీ(యూ) నేత రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అంతకుముందు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ప్రేరణ స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి రాధాకృష్ణన్‌ నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబరు 9న జరగనుంది.

Updated Date - Aug 21 , 2025 | 05:10 AM