Apoorva Mukhija: అపూర్వ ముఖిజకు బెదిరింపులు..చర్యలకు ఎన్‌సీడబ్ల్యూ ఆదేశం
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:08 PM
సమయ్ రైనా వివాదాస్పద "ఇండియాస్ గాట్ లేటెండ్'' షోలో కనిపించిన ముఖిజ తనకు కొద్ది వారాలుగా బెదిరింపులు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో తాజాగా పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీడబ్ల్యూ సుమోటాగా తీసుకుంది.

ముంబై: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ (Apoorva Mukhija) అలియాస్ 'ది రెబల్ కిడ్'ను బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరిపులపై జాతీయ మహిళా కమిషన్ (NCW) చర్యలకు దిగింది. సమయ్ రైనా వివాదాస్పద వెబ్ షో "ఇండియాస్ గాట్ లేటెండ్'' షోలో కనిపించిన ముఖిజ తనకు కొద్ది వారాలుగా బెదిరింపులు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో తాజాగా పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీడబ్ల్యూ సుమోటాగా తీసుకుంది. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించింది.
Mamata Banerjee: మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు.. ఎందుకంటే
''ఏ మహిళా బహిరంగ ప్రదేశాల్లో కానీ, డిజిటల్ ప్రపంచంలో కానీ ఎలాంటి అభద్రతాభావానికి గురికాకూడదు. లైంగిక హింస, చంపుతామనే బెదిరింపులు చాలా ప్రమాదకరమైన సంకేతాలు. వీటి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుని నిందితులను ప్రాసిక్యూట్ చేయాలి" అని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ కుమార్ వర్మకు లేఖ రాసింది. తక్షణం దర్యాప్తు జరిపి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని, ముఖిజాకు అవసరమైన సాయం, భద్రత కల్పించాలని ఆదేశించింది.
స్క్రీన్‌షాట్లు షేర్ చేసిన ముఖిజ
గత కొద్ది వారాలుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని అపూర్వ ముఖిజ మంగళవారంనాడు ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో తెలిపారు. తనపై వస్తున్న యాసిడ్ దాడులు, అత్యాచార బెదిరింపులు, హత్యా బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా జత చేశారు. కాగా, వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' వెబ్ షోలో చేసిన వ్యాఖ్యలకు గాను రణబీర్ అల్హాబాదియా, ముఖిజాలు గత మార్చి మొదట్లో ఎన్‌సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు చెప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి..