MH Wedding invite Incident: మరాఠీపై మరో వివాదం... మహారాష్ట్రలో స్టూడెంట్‌పై తోటి విద్యార్థుల దాడి
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:35 PM
మహారాష్ట్రలోని ఓ కాలేజీలో మరాఠీ భాష విషయంలో వివాదం తలెత్తింది. మరాఠీ భాషలో రాసున్న ఓ పెళ్లి ఆహ్వాన పత్రిక పంపిణీ చేయడంపై అభ్యంతరం చెబుతూ కొందరు విద్యార్థులు తమ తోటి స్టూడెంట్‌పై దాడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఈ మధ్య తరచూ భాష కేంద్రంగా వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా నవీ ముంబైలోని ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మరాఠీ భాషలో రాసున్న వివాహ ఆహ్వాన పత్రికను పంపిణీ చేశాడని ఓ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ దాడి చేశారు. బాధిత విద్యార్థిపై (20) హాకీ స్టిక్‌తో దాడికి దిగారు.
అయితే, ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎమ్ఎన్ఎస్ నేత గజానన్ కాలే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.
మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో కొనసాగుతున్న మరాఠీ వర్సెస్ నాన్ మరాఠీ వివాదాలకు ఈ ఘటన ఓ ఉదాహరణ అని ఎమ్ఎన్ఎస్ మండిపడింది. మరాఠీ విద్యార్థుల భద్రత కోసం నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అంతకుముందు మరో ఘటనలో ఎమ్ఎన్ఎస్‌కు చెందిన కార్యకర్తలు నాందేడ్ బస్టాండ్‌లో ఓ అటెండెంట్‌పై దాడి చేశారు. మరాఠీ భాషను అవమానించాడంటూ దాడికి దిగారు. హిందీ మాట్లాడే ఆ బాధితుడు మరో రాష్ట్రం నుంచి వలస వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు రాష్ట్రంలో కలకలం రేపాయి. బాధితుడు క్షమాపణ చెబుతూ లేఖ రాసిన వైనం కూడా వీడియోలో కనిపించింది.
ఇవి కూడా చదవండి:
డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి