Share News

NHM extension: మరో ఐదేళ్లపాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమం

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:30 AM

జాతీయ ఆరోగ్య కార్యక్రమాన్ని(ఎన్‌హెచ్‌ఎమ్‌) మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్రమంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వెల్లడించారు.

 NHM extension: మరో ఐదేళ్లపాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమం

న్యూఢిల్లీ, జనవరి 22: జాతీయ ఆరోగ్య కార్యక్రమాన్ని(ఎన్‌హెచ్‌ఎమ్‌) మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్రమంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వెల్లడించారు. గత పదేళ్లలో ఎన్‌హెచ్‌ఎమ్‌ చరిత్రాత్మక లక్ష్యాలను చేరుకుందని, 2021-22మధ్య సుమారు 12 లక్షలమంది ఆరోగ్య కార్యకర్తలు ఇందులో చేరారని తెలిపారు. కరోనా మహమ్మారినీ ఈ కార్యక్రమం ద్వారా ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాగా ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. క్వింటాలుకు గతంకన్నా 6ు (రూ.315 చొప్పున) పెంచింది. 2025-26 మార్కెటింగ్‌ సీజన్‌కు క్వింటాలుకు రూ.5,650గా ధర నిర్ణయించింది.

Updated Date - Jan 23 , 2025 | 04:30 AM