Share News

National Film Awards: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:21 PM

2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే(12th ఫెయిల్‌) ఎంపికయ్యారు.

National Film Awards: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్ట్ 01: 2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డు జ్యూరీ కమిటీ శుక్రవారం నాడు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ఈ సందర్భంగా ప్రకటించింది.

ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే(12th ఫెయిల్‌) ఎంపికయ్యారు. మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)లో నటనకు గాను రాణీ ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరీ నిలిచింది.

ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో హన్‌మాన్ చిత్రం అవార్డు అందుకోగా.. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం) అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో వరుసగా ఈ ఏడాది కూడా తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటినట్లు అయింది.

అవార్డులు పొందిన చిత్రాల జాబితా..

  • ఉత్తమ సంగీత దర్శకత్వం: వాతి (తమిళ్) జీవీ ప్రకాష్ కుమార్

  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్: హర్షవర్థన్ రామేశ్వర్

  • ఉత్తమ మేకప్: సామ్ బహూదర్ (హిందీ) శ్రీకాంత్ దేశాయ్

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): పార్కింగ్ (తమిళ్) రామ్‌కుమార్ బాలకృష్ణన్


  • ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఏక్ బందా కాపీ హై (హిందీ) దీపక్ కింగ్రానీ

  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో

  • ఉత్తమ సింగర్: జవాన్ (చెలియా) శిల్పారావు


  • ఉత్తమ మేల్ సింగర్ : బేబీ (రోహిత్)

  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ)

  • ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఉర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా.

  • ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్, పార్కింగ్ (తమిళ్) ముత్తుపెట్టాయ్ భాస్కర్


  • ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ): రాణీ ముఖర్జీ.

  • ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్‌ ఖాన్, 12th ఫెయిల్ (హిందీ) విక్రాంత్ మస్సే.

  • ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్.


  • ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు)

  • ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)

  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 2018 - ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో (మలయాళం) మోహన్‌దాస్


  • ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం) మిధున్ మురళి

  • ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): బేబీ (తెలుగు) సాయి రాజేశ్ నీలం


  • ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ, నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్.

  • ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ)

  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)


  • ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మప్లాంప్లెట్ (మరాఠీ) ఆశీష్ బెండే.

  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్


ఈ వార్తలు కూడా చదవండి..

సామాన్యుడిలా ఆటోలో వచ్చిన సీఎం చంద్రబాబు..

ఆసుపత్రిలో చేరిన 150 విద్యార్థులు.. పలువురి పరిస్థితి ఆందోళనకరం

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 08:13 PM