Share News

Nasha Mukt Bharat Abhiyan: ఉన్నత విద్యాసంస్థల్లో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:24 AM

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రారంభించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌

Nasha Mukt Bharat Abhiyan: ఉన్నత విద్యాసంస్థల్లో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌

  • యూజీసీ, ఎన్‌సీటీఈ ఆధ్వర్యంలో ఏఐసీటీఈ ఆన్‌లైన్‌ సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు10: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రారంభించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌(ఎన్‌ఎంబీఏ) కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారాం పిలుపునిచ్చారు. క్యాంప్‌సల్లో ఈ కార్యక్రమం అమలు తీరు, వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యాసంస్థల అధినేతలతో ఆయన చర్చించారు. యూజీసీ, ఎన్‌సీటీఈ సహకారంతో జాతీయ స్థాయిలో ఈ ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎంబీఏ ప్రచార కార్యక్రమం ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్త డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా 3కోట్ల మందికిపైగా అవగాహన కల్పించనున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 03:24 AM