Share News

Infosys Founders Narayana Murthy: మేం బీసీలం కాదు

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:53 AM

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన భార్య ఎంపీ సుధామూర్తి కర్ణాటక ప్రభుత్వం.....

Infosys Founders Narayana Murthy: మేం బీసీలం కాదు

  • సర్వేకు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులు దూరం

బెంగళూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన భార్య ఎంపీ సుధామూర్తి కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారు. బెంగళూరు నగరపాలక సంస్థ(బీబీఎంపీ) అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొద్దిరోజుల క్రితం ఎన్యూమరేటర్లు నారాయణమూర్తి నివాసానికి వెళ్లారు. వారికి ఆ దంపతులిద్దరూ ‘మా ఇంటిలో ఎటువంటి సర్వే అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్‌ నిర్వహిస్తున్న సామాజిక, విద్యా సర్వే 2025లో నిర్దేశించిన స్వీయ ధ్రువీకరణ పత్రంలో ఆమేరకు సంతకం చేశారు. ఆ అధికారిక నమూనా దరఖాస్తులో... ‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్‌ నిర్వహిస్తున్న సర్వేకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాను’ అని రాసి ఉంది. దానికితోడు సుధామూర్తి కన్నడంలో ‘మేం ఏ బీసీ కులానికీ చెందము. కాబట్టి బీసీ కులాల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో మేం పాల్గొనం’ అని రాశారని తెలిసింది. అయితే దీనిని నిర్ధారించుకోవడానికి సుధామూర్తి, ఆమె వ్యక్తిగత సహాయకులు, ఇన్ఫోసిస్‌ అధికారులకు ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు.

Updated Date - Oct 17 , 2025 | 03:53 AM