Pahalgam Attack: అధికారులు బాంబు పెట్టి మా ఇంటిని కూల్చేశారు.. టెర్రరిస్ట్ చెల్లెలు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:12 PM
Pahalgam Terror Attack: ఎవరో బాంబులు పెట్టి ఆ రెండు ఇళ్లను పేల్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. అనుమానిత టెర్రరిస్టు ఆదిల్ చెల్లెలు.. అన్న గురించి.. ఇళ్లు పేలిపోవటం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.
కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన అసిఫ్ షేక్.. అనంతనాగ్.. బిజ్‌బిహారాకు చెందిన ఆదిల్ తోమర్‌లు పాకిస్తానీ టెర్రరిస్టులతో కలిసి పహల్గామ్ దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం అనుమానిత ఉగ్రవాదులు అసిఫ్, ఆదిల్‌ల ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి ఇల్లులు పేలిపోయాయి. ఎవరో బాంబులు పెట్టి ఆ రెండు ఇళ్లను పేల్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. అనుమానిత టెర్రరిస్టు ఆదిల్ చెల్లెలు.. అన్న గురించి.. ఇళ్లు పేలిపోవటం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘ ఒక అన్న జైలులో ఉన్నాడు. మరో అన్న ఓ ముజాహుద్దీన్. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. నిన్న మా అత్తగారి ఇంటినుంచి పుట్టింటికి వచ్చాను. ఇంట్లో మా అమ్మా,నాన్న మిగిలిన వాళ్లు ఎవరూ లేరు. పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారు. నేను ఇంటి దగ్గర ఉన్నపుడు భద్రతా దళాలు అక్కడికి వచ్చాయి. అధికారులు నన్ను పక్కింటిలోకి వెళ్లమన్నారు. ఓ వ్యక్తి బాంబు లాంటిదేదో మా ఇంటి మీద పెట్టాడు. ఆ వెంటనే మా ఇళ్లు పేలిపోయింది. మేము అమాయకులం. వాళ్లు మా ఇంటిని కూల్చేశారు. మాకేమీ తెలీదు. మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
నిందితుల సమాచారం ఇస్తే 20 లక్షలు
పహల్గామ్, బైసరన్ లోయలో పర్యాటకులపై కొందరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మందిలో 25 మంది ఇండియన్స్ కాగా.. ఒక వ్యక్తి నేపాల్‌కు చెందిన వాడు. ఇక, ఉగ్రదాడికి పాల్పడినట్లు భావిస్తున్న పాకిస్తానీ టెర్రరిస్టుల చిత్రాలను నిఘా వర్గాలు విడుదల చేశాయి. వారికి సంబంధించిన సరైన సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. నలుగురు అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశాయి.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పేలిపోయిన టెర్రరిస్టుల ఇళ్లు
Andhra Pradesh: ఇచ్చిన మాట నిలబెట్టకున్న పవన్ కల్యాణ్..