Share News

Tamil Nadu's Arcot: ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి మాజీ ప్రియురాలి హత్య

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:32 AM

మృతదేహాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఏర్కాడులో 20 అడుగుల లోతున్న లోయలో పడేశారు. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.

Tamil Nadu's Arcot: ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి మాజీ ప్రియురాలి హత్య

‘గాలి ఇంజెక్షన్‌’ ఇచ్చి చంపిన నిందితుడు

చెన్నై, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఓ యువతిని ఆమె మాజీ ప్రియుడు తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి హత్య చేశాడు. వారు ఆమె రక్తనాళాల్లోకి ఖాళీ సిరంజీతో గాలిని ఇంజెక్ట్‌ చేసి చంపేశారు. మృతదేహాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఏర్కాడులో 20 అడుగుల లోతున్న లోయలో పడేశారు. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన అల్ఫియా, పెరంబూరు జిల్లా అరుణాచల గౌండర్‌ నగర్‌కు చెందిన హఫీజ్‌(32) 2023 నుంచి ప్రేమించుకున్నారు. మరోవైపు, హఫీజ్‌ చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేసే కావ్య సుల్తానా (22) అనే యువతితోనూ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్ఫియా.. హఫీజ్‌ను నిలదీసింది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటే అతడి కుటుంబాన్ని అంతం చేస్తానని హెచ్చరించింది. దీంతో హఫీజ్‌ తన ప్రియురాలు కావ్యతో కలిసి అల్ఫియాను హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. ఒకవైపు కావ్యతో ప్రేమాయణం కొనసాగిస్తూనే, హఫీజ్‌ మోనీషా అనే మరో యువతినీ ప్రేమించాడు. ఈమెకు కూడా తన తొలి ప్రియురాలి కథ చెప్పి, ఆమెను హత్య చేసేలా పురిగొల్పాడు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం ఈ ముగ్గురూ కలిసి ఇటీవల సేలంకు వచ్చి, అద్దె కారులో అల్ఫియాను తీసుకుని ఏర్కాడుకు వెళ్లారు. అక్కడ 60 అడుగుల వంతెన వద్ద హఫీజ్‌ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత కావ్య, హఫీజ్‌లు సుల్తానాను గట్టిగా పట్టుకోగా, మోనిషా ఖాళీ సిరంజీలతో పదేపదే సుల్తానా రక్తనాళాల్లోకి గాలిని ఎక్కించడంతో రక్తప్రసరణ ఆగిపోయి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ లోయలోకి విసిరేసి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు.

Updated Date - Mar 06 , 2025 | 05:33 AM