Share News

Blackmail: ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్, సూసైడ్

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:02 PM

మృతుడు రాజ్, సబా ఖురేషి ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. దీన్ని అదునుగా భావించిన సబా పక్కా ప్లాన్ వేసింది. రాజ్‌తో కలిసిన అతని ప్రైవేట్ క్షణాలను వీడియో తీశారు.

Blackmail: ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్, సూసైడ్
blackmail

Blackmail, Extortion, ముంబై, జులై 8: ఒక యువ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా వస్తున్న వేధింపులు భరించలేక చివరికి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఇంకా రూ. మూడు కోట్లకు పైగా చెల్లించమని బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తుండటంతో చివరికి విషం తాగి ఇవాళ తనువు చాలించాడు. చనిపోతూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిన బాధితుడు.. తన ఆత్మహత్యకు ఆ ఇద్దరే కారణమని తన లేఖలో పేర్కొన్నాడు. ఒక పేజీలో తన తల్లికి, మరొక పేజీలో తన సహోద్యోగులకు తాను ఆత్మహత్య చేసుకోడానికి దారి తీసిన కారణాలను వివరించాడు.

Untitled-12.jpgరాజ్ లీలా మోర్ అనే 32 ఏళ్ల యువకుడు ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తనకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోను లీక్ చేస్తామని కొన్ని నెలలుగా రాహుల్ పర్వానీ, సబా ఖురేషి అనే మహిళ.. ఇద్దరు బెదిరింపులకు గురిచేస్తున్నారని తన సూసైడ్ నోట్‌లో రాజ్ పేర్కొన్నాడు. గత 18 నెలల్లో వీరిద్దరు తన నుండి కోట్లాది డబ్బును దోచుకున్నారని నోట్‌లో రాశాడు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. స్టాక్ మార్కెట్‌లో రాజ్ మోర్ భారీ పెట్టుబడులు పెట్టడం, చార్టర్డ్ అకౌంటెంట్‌గా అతని అధిక జీతం ఉన్న ఉద్యోగం గురించి నిందితులకు తెలుసని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో మోర్‌ను అతని కంపెనీ ఖాతా నుండి భారీ మొత్తంలో డబ్బును వారి వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేయమని నిందితులు బలవంతం చేశారని చెప్పారు. ఇవే కాకుండా, ఇద్దరు నిందితులు రాజ్ నుంచి లగ్జరీ కారును కూడా బలవంతంగా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. తన కొడుకు గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని రాజ్ తల్లి పోలీసులకు వివరించారు.


ఇక, రాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డ గది నుండి అధికారులు మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి అతని తల్లికి రాశాడు. ఆ నోట్‌లో, అతను క్షమాపణలు కోరుతూ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిని కోరాడు. రెండవ పేజీలో, రాజ్ తన సహోద్యోగులకు రాశాడు. 'దీపా లఖానీ.. ఈ రోజు నాకు క్షమాపణ చెప్పడానికి మాటలు లేవు, ఎందుకంటే నేను మీ నమ్మకాన్ని వమ్ము చేసాను. కానీ నన్ను నమ్మండి, ఇది చివరిసారి. మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నేను ఏ మోసం చేసినా, నేనే చేసాను; ఎవరికీ ఏమీ తెలియదు. నేను స్టేట్‌మెంట్ (ఖాతాను)ను మార్చలేదు. శ్వేత, జయప్రకాష్‌లకు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలియదు. దయచేసి వారిపై ఎటువంటి చర్య తీసుకోకండి' అని ఆయన రాశారు.

మూడవ పేజీలో మోర్ తన మరణానికి రాహుల్, సబాను కారణమని పేర్కొన్నాడు. 'నేను, రాజ్ మోర్. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు రాహుల్ పర్వానీదే బాధ్యత. అతను నన్ను మోసగించి నెలల తరబడి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. నా సేవింగ్స్ మనీ దొంగిలించాడు. అంతేకాక, నా కంపెనీ ఖాతా నుండి డబ్బును దొంగిలించాడు. నా మరణానికి రాహుల్ పర్వానీ, ఇంకా సబా ఖురేషి బాధ్యులు' అని రాజ్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై దోపిడీ, ఇంకా ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఇలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే, మృతుడు రాజ్, ఇంకా సబా ఖురేషి ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. దీన్ని అదునుగా భావించిన సబా ఖురేషి పక్కా ప్లాన్ వేసింది. ఆమె బాయ్ ఫ్రండ్ రాహుల్ పర్వానీని ముందుగా పురమాయించి, రాజ్‌తో కలిసిన అతని ప్రైవేట్ క్షణాలను వీడియో తీశారు. ఈ వీడియో అడ్డం పెట్టుకుని రాజ్ ను కోట్ల రూపాయల మేర దోచేశారు. మరో మూడు కోట్ల రూపాయలు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ, వేధింపులు తీవ్రతరం చేశారు. అంతేకాదు, సబా, రాహుల్ ఇద్దరూ కలిసి రాజ్ ఇంటికి వచ్చి అతని తల్లి ముందు కొట్టారు. దీంతో వేధింపులు తట్టుకోలేక రాజ్ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా

రాముడు మావాడే.. శివుడూ మావాడే

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 06:25 PM