Luxury Car: మోదీ ప్రయాణించిన హాంగ్‌చీ కారు విశేషాలివే!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:38 AM
ఎ్‌ససీవో సదస్సు సందర్భంగా చైనా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ ‘మేడ్ ఇన్ చైనా’ తయారీ అత్యంత ఖరీదైన కారుగా పేరున్న హాంగ్చీ-ఎల్5 మోడల్ కారులో ప్రయాణించిన విషయం తెలిసిందే..!
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఎ్‌ససీవో సదస్సు సందర్భంగా చైనా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ ‘మేడ్ ఇన్ చైనా’ తయారీ అత్యంత ఖరీదైన కారుగా పేరున్న హాంగ్చీ-ఎల్5 మోడల్ కారులో ప్రయాణించిన విషయం తెలిసిందే..! ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మాండరిన్ భాషలో హాంగ్చీ అంటే.. ‘ఎర్రజెండా’ అని అర్థం. హాంగ్చీ-ఎల్5 ధర భారతీయ కరెన్సీలో రూ.7 కోట్లు. మొదట్లో ఈ కార్లను కమ్యూనిస్టు పార్టీ నేతల కోసం రూపొందించారు. 8.5 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లు. క్రూయిజ్ మోడ్‌తోపాటు.. ఆల్‌వీల్ డ్రైవ్, పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరాలు దీని ప్రత్యేకత. ఇందులో విశాలమైన, విలాసవంతమైన సీట్లు ఉంటాయి.
వెనక సీట్లలో మసాజ్, హీటింగ్, వెంటిలేషన్ సదుపాయాలు ఉంటాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2019లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ కారులోనే ప్రయాణించారు. బహిరంగ కార్యక్రమాల్లో ఈ కారును అధికంగా వాడుతారు. దీంతోపాటు.. ఆయన మరిన్ని రక్షణ సదుపాయాలు, ఆయుధాలు ఉండే హాంగ్‌చీ-ఎన్701ను కూడా వాడుతుంటారు. ఈకారును అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ‘ద బీస్ట్’తో పోలుస్తారు.