Share News

PM Modi: ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:41 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: చంద్రబాబు

వేలాది కుటుంబాలకు కొత్త ఆశ: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్టీల్‌ ప్లాంట్‌కు రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Updated Date - Jan 18 , 2025 | 05:41 AM