Lloyds Metals & Energy has announced: మల్లోజులను మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:47 AM
లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ ముందుకొచ్చింది.
లొంగిపోయిన మిగతా నక్సల్స్‌కూ పని కల్పిస్తాం
ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన
లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ ముందుకొచ్చింది. శిక్షణ ఇచ్చి తమ కంపెనీలో పనికి పెట్టుకుంటామని ఈ కంపెనీ ఎండీ బి. ప్రభాకరన్ ప్రకటించారు. ‘‘తన సిద్ధాంతం కోసం అడవిలో 30 ఏళ్లకుపైగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి మాకిది మంచి అవకాశం. ఆయన ముందుకొస్తే మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం. మిగతా లొంగిపోయిన నక్సల్స్‌ను కూడా మా కంపెనీలో భాగం చేసుకుని, వారు చేయగల పని ఇవ్వడంపై దృష్టి సారించాం’’ అని ప్రభాకరన్ తెలిపారు.