Meghalaya Honeymoon couple: భార్య అఫైర్ వల్లే భర్త చనిపోయాడా.. పోలీసులు ఏం చెబుతున్నారంటే
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:54 PM
హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి హత్యకు గురైన వ్యక్తి కేసులో పోలీసులు అతడి భార్యనే అనుమానిస్తున్నారు. ఆమెకు ఉన్న అఫైర్ వల్లే భర్త ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘవంశీకి మే నెల 11వ తేదీన సోనమ్‌తో వివాహం జరిగింది.
షిల్లాంగ్: హనీమూన్ కోసం మేఘాలయ(Meghalaya) వెళ్లి హత్యకు గురైన వ్యక్తి కేసులో పోలీసులు అతడి భార్యనే అనుమానిస్తున్నారు. ఆమెకు ఉన్న అఫైర్ వల్లే భర్త ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘవంశీకి మే నెల 11వ తేదీన సోనమ్‌తో వివాహం జరిగింది. 20వ తేదీన వారిద్దరూ హనీమూన్ (Honeymoon) కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత రఘవంశీ మృతదేహం ఓ జలపాతం దగ్గర లభ్యమైంది (Crime News).
రఘువంశీ మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అతడు హత్యకు గురైనట్టు స్పష్టమైంది. అయితే గాజీపూర్ నుంచి కుటుంభసభ్యులకు ఫోన్ చేసిన సోనమ్ విషయం చెప్పింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సోనమ్‌కు రాజ్ కుశ్వాహా అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడి సహకారంతోనే భర్తను సోనమ్ హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సోనమ్ సుపారీ ఇచ్చి తన భర్తను చంపించిందని పోలీసులు చెబుతున్నారు.
ఈ హత్యకు ఆమె బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుశ్వాహా సహకరించాడని పోలీసుల ప్రాథమిక దర్యాఫ్తులో తేలినట్టు సమాచారం. ఈ హత్యతో సంబంధం ఉన్న విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ అనే వ్యక్తులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముగ్గురు తాము సుఫారీ తీసుకుని రఘువంశీని హత్య చేసినట్టు అంగీకరించారని సమాచారం. ఈ హత్యలో సోనమ్, రాజ్ కుశ్వాహా పేర్లను వారు బయటపెట్టినట్టు తెలుస్తోంది. కాగా, తాను నిందితురాలిని కానని, తనను ఎవరో కిడ్నాప్ చేశారని సోనమ్ చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు సోనమ్ రఘువంశీ తండ్రి దేవి సింగ్ మాత్రం తన కుమార్తె అమాయకురాలని చెప్పుకొచ్చారు. ఆమె తన భర్తను చంపి ఉండదని అన్నారు. తన కుమార్తె విషయంలో మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని సోనమ్ తండ్రి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి
మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి