Meerut Blue Drum Case: కూతురికి జన్మనిచ్చిన ముస్కాన్.. మొదలైన వివాదం..
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:28 PM
భర్తను చంపిన కేసులో ప్రియుడితో పాటు జైలు పాలైన ముస్కాన్ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించనున్నారు. డీఎన్ఏ పరీక్ష చేయించాలని కోరనున్నారు.
లక్నో: మీరట్ బ్లూ డ్రమ్ కేసు గుర్తుండే ఉంటుంది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేసింది. భర్త శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో కప్పేసింది. చివరకు పాపం పండి నిందితులిద్దరూ జైలు పాలయ్యారు. జైలు పాలయ్యేనాటికి ముస్కాన్ గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సౌరభ్ పుట్టిన రోజే నాడే ఆ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. అయితే, ఆ బిడ్డను తమ వారసురాలిగా సౌరభ్ రాజ్‌పుత్ తల్లిదండ్రులు అంగీకరించటం లేదు.
ఆ బిడ్డ పుట్టుకపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియడానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని సౌరభ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సౌరభ్ సోదరుడు రాహుల్ డీఎన్ఏ పరీక్షలకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాడు. ఈ విషయాన్ని బుధవారం జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. సౌరభ్ తల్లి కూడా డీఎన్‌ఏ పరీక్షల వైపే మొగ్గుచూపుతోంది. డీఎన్‌ఏ పరీక్షల్లో ఫలితాలను బట్టి బిడ్డను అంగీకరిస్తామని స్పష్టం చేసింది. అధికారులు పాప గురించి మాట్లాడుతూ..

‘పాప తల్లితో పాటు ఉమెన్స్ బ్యారెక్‌లోనే ఉంటుంది. పాపకు ఆరు నెలల వయసు వచ్చే వరకు అక్కడే ఉంటుంది. జైలు అధికారులు ఆమెకు బట్టలు, పోష్టికాహారం, మెడిసిన్స్ అందిస్తారు’ అని తెలిపారు. ముస్కాన్ తన బిడ్డను ప్లాన్ చేసి మరీ సౌరభ్ పుట్టిన రోజు నాడే కన్నదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. అధికారులు మాట్లాడుతూ.. ‘డాక్టర్లు డెలివరీ కోసం ఓ డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజునే ముస్కాన్ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు చెప్పిన డేట్ రోజునే డెలివరీ అవ్వటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యింది’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?
వరుస నష్టాలకు బ్రేక్.. భారీగా లాభపడిన సెన్సెక్స్..