Medical Student: పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:10 AM
పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం జరిగింది. ఒడిశాకు చెందిన ఒక వైద్య విద్యార్థినిని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు శనివారం తెలిపారు.......
కోల్‌కతా, అక్టోబరు 11 : పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం జరిగింది. ఒడిశాకు చెందిన ఒక వైద్య విద్యార్థినిని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు శనివారం తెలిపారు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో రెండో సంవత్సరం వైద్య విద్య చదువుతోన్న విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి భోజనానికి క్యాంపస్ బయటకు రాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఆమె అదే కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని శుక్రవారం రాత్రి 8-8.30 గంటల మధ్య తన స్నేహితుడితో కలిసి వైద్య కళాశాల బయటకు వచ్చిన ట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆ సమయంలో ముగ్గురు గుర్తుతెలియని యువకులు వారి వద్దకు వచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. అనంతరం ఆ ముగ్గురు ఆమె ఫోన్ లాక్కుని క్యాంపస్ బయట ఉన్న అడవిలోకి లాక్కు వెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనే గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ఆర్జీకార్ మెడికల్ కళాశాలలోనే వైద్యురాలిని రేప్ చేసి హత్య చేశారు. ఈ ఏడాది జూన్‌లో దక్షిణ కోల్‌కతాలోని లా కళాశాలలో న్యాయ విద్యార్థినిని ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారు. రెండు నెలల క్రితం జోకాలోని ప్రతిష్టాత్మక ఐఐఎం మెన్స్ హాస్టల్‌లో మేనేజ్‌మెంట్ విద్యార్థినిని రేప్ చేశారు.