Share News

Banking Error: అమౌంట్‌ స్థానంలో అకౌంట్‌ నంబర్‌.. కస్టమర్‌ ఖాతాలోకి రూ. 52,314 కోట్లు

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:48 AM

అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూపులో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది. కాకపోతే ఒకటి రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 52,314 కోట్ల నగదు పొరపాటున ఒకరి ఖాతాలోకి జమయ్యింది.

Banking Error: అమౌంట్‌ స్థానంలో అకౌంట్‌ నంబర్‌.. కస్టమర్‌ ఖాతాలోకి రూ. 52,314 కోట్లు

వాషింగ్టన్‌, మార్చి 4: బ్యాంకు ఉద్యోగులు చేసే చిన్న చిన్న పొరపాట్లతో ఒకరి ఖాతాలో జమవ్వాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలో పడటం లేదా పెద్ద మొత్తంలో నగదు అకౌంట్‌లో జమకావడం చూస్తూ ఉంటాం. అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూపులో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది. కాకపోతే ఒకటి రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 52,314 కోట్ల నగదు పొరపాటున ఒకరి ఖాతాలోకి జమయ్యింది. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూపు ఉద్యోగి ఓ కస్టమర్‌ ఖాతాలోకి నగదు జమ చేయబోయి.. పొరపాటున అమౌంట్‌ స్థానంలో కస్టమర్‌ అకౌంట్‌ నంబరు కొట్టారు. లావాదేవీలు పర్యవేక్షించాల్సిన మరో అధికారి కూడా దాన్ని క్లియర్‌ చేశారు. దాంతో సంబంధిత కస్టమర్‌ ఖాతాలోకి రూ. 52,314 కోట్లు జయయ్యాయి. తర్వాత జరిగిన పొరపాటును గుర్తించి, ఆ లావాదేవీని రివర్స్‌ చేసి నగదును వెనక్కు తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 05:48 AM