Maoist surrender: ఆశన్న కూడా..
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:57 AM
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు అగ్రనేత
70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి ఎదుటకు
ఆశన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్
ఛత్తీ్‌సగఢ్‌లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు.. వీరిలో 48 మంది మహిళలు
11కు తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య
ములుగు, చర్ల, గడ్చిరోలి, కాంకేర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట లొంగిపోగా.. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తన సహచరులు 70 మందితో కలిసి ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మల్లోజుల టీమ్ లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం
మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు తుపాకీని అప్పగిస్తున్న మల్లోజుల వేణుగోపాల్‌రావు
మల్లోజుల ముందుకొస్తే మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం
లొంగిపోయిన మిగతా నక్సల్స్‌కూ పని కల్పిస్తాం
ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన
మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల సరెండర్
మరో 60 మందితో కలిసి ఆయుధాల అప్పగింత
నక్సల్స్ పతనానికి మల్లోజుల లొంగుబాటు నాంది: ఫడణవీస్
రూ.6 కోట్ల రివార్డు వేణుగోపాల్‌కే అప్పగింత
బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో లొంగిపోయిన నక్సలైట్లు
గమనార్హం. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. ఈ గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు (ఆశన్న). చిన్న కుమారుడు సహదేవరావు. ఆశన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం కాజీపేట ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను అభ్యసించాడు. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆశన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. మొదట కాకతీయ యూనివర్సిటీ సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు ఆశన్న నాయకత్వం వహించారు. ఐపీఎస్ ఉమే్‌షచంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆశన్న పాత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలకపాత్ర ఆశన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశన్న.. 2024 నవంబరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు వదంతులు వ్యాపించాయి. కాగా.. ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన కొద్దిరోజులకే ఆయన తండ్రి మరణించారని, తల్లి సరోజన చిన్న కుమారుడి వద్ద ఉంటోందని గ్రామస్థులు తెలిపారు.
ప్రస్తుతం ఆశన్న వయసు 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే!
లొంగుబాట్ల పర్వం
దేశంలోని 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు కకావికలం అవుతున్నారు. ఎన్‌కౌంటర్ల ధాటికి ఆయుధాలను అప్పగిస్తున్నారు. రోజురోజుకూ సరెండర్ల సంఖ్య పెరుతోంది. పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ఎదుట తన సహచరులు 60 మందితో సహా లొంగిపోగా.. ఛత్తీ్‌సగఢ్‌లోను మావోయిస్టులు భారీగా అదే బాట పట్టారు. కాంకేర్, సుక్మాల్లో బుధవారం 78 మంది నక్సల్స్ పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 42 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఇద్దరు నేతలు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సుక్మాలో పదిమంది మహిళలు సహా 27 మంది.. పోలీసుల ఎదుట అస్త్రసన్యాసం చేశారు. ఇందులో 16 మందిపై రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉంది. కాంకేర్‌లో 32 మంది మహిళలు సహా 51 మంది.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎదుట లొంగిపోయారు. 39 తుపాకులను కూడా సమర్పించారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీఎ్‌సజడ్‌సీ) సభ్యుల నుంచి డివిజనల్ కమిటీలు, పలు పార్టీ విభాగాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. డీఎ్‌సజడ్‌సీ నుంచి రాజు సలామ్, రాజ్‌మల్ మందావీ ఉన్నారు. ఇక గురువారంనాడు.. మాడ్ ఏరియా కమిటీ సభ్యులు సుమారు 70 నుంచి 100 మంది జగ్దల్‌పూర్ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం. ఇదే టీంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మాడ్ ఏరియాకు చెందిన సాల్మన్, రాజు, రజిత ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వీరంతా జగ్దల్‌పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్‌కు చేరుకున్నట్లు సమాచారం.
అగ్రనాయకులు ఇంకెవరున్నారు?
లొంగుబాట్లు, అరెస్టుల తరువాత మావోయిస్టు పార్టీలో అగ్రనాయకులు ఇంకెవరు ఉన్నారు అంటే.. తెలంగాణలో పార్టీ కార్యదర్శి దామోదర్, చంద్రన్న, ఆజాద్ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో హిడ్మా, బాలు, పాపారావు, తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, సంగ్రాం, ఘణపతి, విశ్వనాథ్, ఘనేష్, విశేష్ బెహరా అలియాస్ భాష్కర్, తునాన్‌దా ఇతరులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ చెందిన పలువురు నాయకులు కీలక ప్రాత పోషించారు. వారి మాటలతో అనేక మంది మావోయిస్టు పార్టీలో చేరారు. వారి వల్ల సాయుధ పోరాటం తీవ్రస్ధాయికి చేరింది. అలాంటివారు ఇప్పుడు తాము లొంగిపోవడమే కాక పదుల సంఖ్యలో తమ సహచరులను కూడా లొంగిపోయేలా చేయడం గమనార్హం.