Share News

Mani Shankar Aiyar: పరీక్ష తప్పిన రాజీవ్‌ ప్రధాని ఎలా అయ్యారో?!

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:26 AM

పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజీవ్‌తో కలిసి తాను చదువుకున్నానని, అక్కడ ఆయన పరీక్ష తప్పారని పేర్కొన్నారు.

 Mani Shankar Aiyar: పరీక్ష తప్పిన రాజీవ్‌ ప్రధాని ఎలా అయ్యారో?!

కాంగ్రెస్‌ వృద్ధ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 5: ఓ సాధారణ పైలెట్‌.. అంతేగాక రెండుసార్లు పరీక్షలు తప్పిన వ్యక్తి దేశానికి ప్రధాని ఎలా అయ్యారా... అని తాను అనుకొనేవాడినని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్‌ వృద్ధ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజీవ్‌తో కలిసి తాను చదువుకున్నానని, అక్కడ ఆయన పరీక్ష తప్పారని పేర్కొన్నారు. తమ విద్యార్థులు ఎవరూ పరీక్ష తప్పకుండా ఆ విశ్వవిద్యాలయం సూచనలు ఇస్తుందని వివరించారు. అయినా రాజీవ్‌ తప్పారని వెల్లడించారు. తర్వాత ఆయన లండన్‌లోనిఇంపీరియల్‌ కళాశాలలో చదువుకొనేందుకు వెళ్లారని, అక్కడా పరీక్ష తప్పారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని అప్పుడు తాను భావించానని వివరించారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 05:26 AM