Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:35 PM
Live In Partner: 10 ఏళ్ల నుంచి సోనియా అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ బద్కల్ కాలనీలోని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, సోనియాను జితేంద్ర చంపేశాడు. ఆమె శవాన్ని బెడ్డు కింద దాచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి నేరుగా బామ్మ సుందరీ దేవి ఇంటికి వెళ్లాడు.

మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే.. వారి సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వాళ్లు మనతో లేకపోయినా.. సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది మనల్ని నమ్మి మనతో పాటు ఉంటున్న వ్యక్తిని ఎలా చూసుకోవాలి?.. మగాళ్లు ఆడవాళ్లను రాణిలా చూసుకోవాలి. ఇది ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది. స్త్రీలు తమ భాగస్వామిని రాజులా చూస్తే.. అతడి పక్కన రాణిలా ఉండొచ్చు. బానిసలా చూస్తే.. బానిస భార్యగా బతకొచ్చు. బంధం ఏదైనా కావచ్చు. అనుమానాలు.. గొడవలు సహజం. అయితే, ఆ అనుమానాలు, గొడవలు హద్దు దాటితేనే దారుణాలు జరుగుతాయి. ప్రాణాలు పోతాయి. తాజాగా, ఓ వ్యక్తి 10 ఏళ్లుగా తనతో పాటు సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు. శవాన్ని బెడ్డు కింద దాచి పరారయ్యాడు. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు, నిందితుడి బామ్మ తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని ఫరీదాబాద్, జవహార్ కాలనీకి చెందిన జితేంద్రకు 15 ఏళ్ల క్రితం పూనమ్‌తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. దాదాపు 12 ఏళ్లక్రితం పూనమ్ చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత జితేంద్ర బిడ్డల్ని పట్టించుకోవటం మానేశాడు. 10 ఏళ్ల నుంచి సోనియా అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ బద్కల్ కాలనీలోని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, సోనియాను జితేంద్ర చంపేశాడు. ఆమె శవాన్ని బెడ్డు కింద దాచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి నేరుగా బామ్మ సుందరీ దేవి ఇంటికి వెళ్లాడు.
సోనియాను హత్య చేసిన విషయాన్ని ఆమెకు చెప్పాడు. సరన్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని సుందరీ దేవితో అన్నాడు. అయితే, అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎక్కడికో పారిపోయాడు. మనవడు చెప్పింది విన్న తర్వాతి నుంచి సుందరీ దేవికి భయం పట్టుకుంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. జరిగిందంతా పోలీసులకు చెప్పింది. వారిని వెంట బెట్టుకుని హత్య జరిగిన ఇంటికి వెళ్లింది. పోలీసులు తాళం పగులకొట్టి లోపలికి వెళ్లారు. బెడ్డుకింద ఉన్న శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదండి
అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..
Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు