Share News

తోడల్లుడిపై కారు ఎక్కించి చంపిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:31 PM

ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ బలహీనపడిపోతున్నాయి. జనం తమ స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన తోడల్లుడిపై కారు ఎక్కించి మరీ చంపేశాడు.

తోడల్లుడిపై కారు ఎక్కించి చంపిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Bihar

హోలీ పండుగ వేల ఓ కుటుంబంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తోడల్లుడిని కారు ఎక్కించి మరీ చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ సంఘటన బీహార్‌లోని ససరామ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. చవారియా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్, మోతీవారి గ్రామానికి చెందిన సుభాష్ సింగ్.. కురుప్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్ర, సుభాష్‌లు హోలీ పండుగ జరుపుకోవడానికి అత్తింటికి వచ్చారు. అక్కడ అత్తింటికి సంబంధించిన ఆస్తి విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ గొడవ చినికి, చినికి గాలి వానలా మారింది. కొట్టుకునే వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర కుమార్, సుభాష్‌పై పగ పెంచుకున్నాడు.


ఎలాగైనా అతడ్ని చంపేసి అత్తింటి ఆస్తిని తన సొంతం చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం ఓ పక్కా ప్లాన్ వేశాడు. ధర్మేంద్ర తన కారులో అత్తింటికి 200 మీటర్ల దూరంలో సిద్ధంగా ఉన్నాడు. సుభాష్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత సుభాష్ బైకు మీద బయటకు వచ్చాడు. అది గమనించిన ధర్మేంద్ర కారుతో బైకును ఢీకొట్టాడు. సుభాష్ బైకుతో సహా కిందపడ్డాడు. ఆ వెంటనే ధర్మేంద్ర తన కారును సుభాష్ పైకి ఎక్కించాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సుభాష్ చనిపోగానే ధర్మేంద్ర కారును వదిలేసి అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


కొద్దిసేపటికి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బైకు, కారును సీజ్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. ఇక, ఈ సంఘటనతో చుట్టు పక్కల గ్రామాల్లో అలజడి మొదలైంది. సుభాష్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.


Read also : AR Rahman : ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్.. స్పందించిన కుమారుడు..

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Ashwini Vaishnaw: తమిళం మధురమైన భాష... మన దేశ ఆస్తి, ప్రపంచ ఆస్తి కూడా

Updated Date - Mar 16 , 2025 | 03:54 PM