Bangalore: చెప్పులో పాము.. కాటేయడంతో టెకీ మృతి
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:11 AM
చెప్పులో దాగి ఉన్న పాము కాటేయడంతో ఓ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు జిల్లా బన్నేరుఘట్ట రంగనాథ లేఅవుట్‌లో మంజుప్రకాశ్(41) అనే టెకీ నివాసం ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి బయట...
బెంగళూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చెప్పులో దాగి ఉన్న పాము కాటేయడంతో ఓ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు జిల్లా బన్నేరుఘట్ట రంగనాథ లేఅవుట్‌లో మంజుప్రకాశ్(41) అనే టెకీ నివాసం ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి బయట ఉండే చెప్పులు వేసుకుని కాస్త దూరంలోని సర్కిల్ దాకా నడిచి వెళ్లి చెరకు రసం తీసుకొచ్చాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
గంట తర్వాత ఇంటికి వచ్చిన ఓ కార్మికుడు చెప్పుల్లో నుంచి పాము బయటకు వస్తుండడాన్ని గుర్తించాడు. వెంటనే పామును చంపేశారు. ఆ చెప్పులు ప్రకాశ్‌కు చెందినవిగా గుర్తించి అతడి గదిలోకి వెళ్లి చూడగా.. అతడు అప్పటికే నోట్లో నురగ, రక్తం వచ్చి చనిపోయి ఉన్నాడు. మంజుప్రకాశ్ 2016లో బస్సు ప్రమాదంలో గాయపడడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సయాటికా సమస్యతో కాలు కొంతమేర స్పర్శ ఉండడం లేదని ప్రకాశ్ తమ్ముడు హరీశ్ తెలిపారు. అందుకే పాము కాటేసినా గుర్తించలేక పోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Rates Today: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Agri Director Dilli Rao: ఖరీఫ్ అవసరాలకు సరిపడా యూరియా