Bengaluru Petrol Attack: కూతురిపై కన్నేసిన యువకుడు.. ఆమె తల్లిని ఏం చేశాడో తెలుసా?..
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:31 PM
ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ కూతురిపై కన్నేసిన ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మహిళను చంపి ఆమె కూతుర్ని దక్కించుకుందామని అనుకున్నాడు.
ఓ మహిళ కూతురిపై కన్నేసిన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తనకు సదరు మహిళ కూతురిని ఇచ్చి పెళ్లి చేయటం లేదన్న పగతో ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బసవేశ్వరనగర్, భోవి కాలనీకి చెందిన గీత అనే మహిళ తనుండే ప్రాంతంలోనే కిరాణ షాపు నిర్వహిస్తోంది. ఆమెకు 19 ఏళ్ల కూతురు ఉంది.
ముత్తు అనే యువకుడికి గీతతో పరిచయం ఉంది. అతడు టీ షాపు నిర్వహిస్తూ ఉన్నాడు. గీత, ఆమె కూతురు, ముత్తు ఒకే ఇంట్లో ఉంటున్నారు. గీత కూతురిపై ముత్తు కన్నుపడింది. కూతురిని ఇచ్చి పెళ్లి చేయమని ముత్తు.. గీతపై గత కొన్ని నెలల నుంచి ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. గీత ఇందుకు ఒప్పుకోవటం లేదు. కొద్దిరోజులనుంచి అతడి వేధింపులు మరింత పెరిగాయి. అయినా కూడా గీత వెనక్కు తగ్గలేదు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేది లేదని తేల్చి చెప్పింది. దీంతో గీతపై ముత్తు పగ పెంచుకున్నాడు. ఆమెను చంపైనా సరే అమ్మాయిని దక్కించుకోవాలని అనుకున్నాడు.
గీతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. మంటల్లో కాలుతూ గీత గట్టిగా అరవసాగింది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ముత్తు కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే..
రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం